కేజ్రీవాల్ కు దక్కని ఊరట..
ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెను కోర్టు బెయిల్ ప్రకటించింది. మరోవైపు అదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 3వ తేదీ వరకు రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. సీబీఐ దాఖలు చేసిన 4వ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈ ఛార్జిషీటులో కేజ్రీవాల్, మరో ఐదుగురు పేర్లను సీబీఐ చేర్చింది. సెప్టెంబర్ 3న దీనిపై కోర్టు విచారణ జరపనుంది.

