Home Page SlidermoviesNational

విజయ్‌కి థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేష్

ఇటీవల కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరోయిన్ తన పెళ్లికి తన ఫేవరేట్ హీరో దళపతి విజయ్‌ను ఆహ్వానించింది. ఆమె పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుండి విజయ్ మాత్రమే వచ్చారట. కీర్తి కోరిక మేరకు నవ దంపతులతో ఫోటో తీసుకున్నారు. దీనికి కీర్తి విజయ్‌కు సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పింది. తన పెళ్లిలో తమ డ్రీమ్ ఐకాన్‌ నుంచి తమకు ఆశీర్వాదం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.