మహిళా బిల్లుపై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మోదీజీ:కవిత
అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014లో నరేంద్ర మోదీ మాటిచ్చారన్నారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందన్నారు. మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందన్నారు. ప్రజలు, బీజేపీకి 300కి పైగా ఎంపీ స్థానాలిచ్చినా బిల్లు ఆమోదించడం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలన్న డిమాండ్‌తో తాము జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లు మాత్రం ఆమోదం పొందడం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా, దేశంలోని పలు పార్టీలు రేపు మహిళా బిల్లు దీక్షకు మద్దతిస్తున్నాయని కవిత వెల్లడించారు.

