కేదారనాథ్ ఆలయం ఇప్పుడు తెలంగాణలోనే
ప్రతీ శివభక్తడు జీవితంలో ఒక్కసారైనా కేదారనాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకుంటారు. ఇప్పుడు తెలంగాణలోనే కేదారనాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చార్ ధామ్ యాత్రకు వెళ్లలేని భక్తులు ఇక్కడ నిర్మించబోతున్న కేదారనాథ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. దీనికోసం మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామాన్ని ఎంచుకున్నారు. వారణాశి పీఠాధిపతులు అయోధ్యధామ్ మహంతి ప్రత్యేక భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు కూడా హాజరయ్యారు. ప్రసిద్ధ కేదారనాథ్ ఆలయాన్ని ఈ ప్రదేశంలో నిర్మించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.


 
							 
							