KCR దోచుకున్న సొమ్ము తిరిగి ఓటర్ల జేబుల్లోకే: రాహుల్
తెలంగాణ: ప్రజల నుంచి సీఎం కేసీఆర్ చాలా డబ్బు దోచుకుని, దాచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపణ. ముందుగా సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలి. ప్రజల నుంచి కేసీఆర్ దోచిన డబ్బుపై లెక్కలు అడుగుతాం, ప్రశ్నిస్తాం, ఊరుకోం. ఆ తర్వాత తిరిగి ప్రజల సొమ్ము వారి వారి అకౌంట్లలో పడేలా చేస్తాం. నేను ఇచ్చిన హామీ అమలు చేసి తీరుతా అని కల్వకుర్తి సభలో రాహుల్ మాట్లాడారు. అటు ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ 20 లక్షల మంది దగ్గర భూములు లాక్కున్నారన్న రాహుల్ గాంధీ.