విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్‌కు కేసీఆర్ లేఖ
తెలంగాణాలో విద్యుతో కొనుగోలు విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఈ నెల 15లోపు వివరణ ఇవ్వాలని ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురికి నోటీసులు పంపించింది. ఈ మేరకు కేసీఆర్ ఇవాళ జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్‌కు 12 పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా ఈ లేఖలో కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ ఎల్.నరసింహరెడ్డిని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. మీరు అడిగిన విధంగా జూన్ 15 లోపు సమాధానం ఇవ్వాలనుకున్నానన్నారు.అయితే ఈలోపు దీనిపై జస్టిస్ మీడియా సమావేశం నిర్వహించారు.తెలంగాణాలో నన్ను,బీఆర్ఎస్ ప్రభుత్వ కాలన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నస్తోంది అన్నారు. విచారణ నిస్పక్షపాతంగా జరగడం లేదని కేసీఆర్ ఆరోపించారు. దీనిపై విచారణ పూర్తికాకముందే ఇప్పటికే తప్పు జరిగినట్టు..ఆర్థిక నష్టాన్ని లెక్కించడమే మిగిలినట్టు జస్టిస్ నరసింహరెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కాగా దీనిపై విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లు కమిషన్ మాటలు ఉన్నాయన్నారు.కేవలం రాజకీయకక్ష కోసమే జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ వేశారన్నారు.జస్టిస్ నరసింహరెడ్డి తీరు న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కమిషన్ చూస్తోందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.


 
							 
							