కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు మొదలయ్యాయి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఓటమి భయంతో సీఎం కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు దిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. పలుచోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఇతర పార్టీల అభ్యర్థులను వేధిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు నామినేషన్‌లు వేశారు. కామారెడ్డిలోనూ 58 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసుల చేత భయపెట్టిస్తున్నారు. బీజేపీ తరఫున 39 మంది బీసీలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. బీఆర్ఎస్ 23 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు కేటాయించింది.

