Home Page SliderTelangana

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత ఎవరినీ బెదిరించలేదని, ఆమెను అనవసరంగా అరెస్టు చేశారంటూ… కవిత తరపున ముకుల్ రోహత్గీ కోర్టులో కేసు వాదించారు. ఈడీ కేసులో గత ఐదున్నర నెలలుగా జైల్లో ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై గంటన్నరపాటు కోర్టులో వాదనలు జరిగాయి. కవితను ఒక మహిళగానూ పరిగణించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ తుది చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీం కోర్టు పేర్కొంది. కవిత బెయిల్ కు సంబంధించి ఈ మూడు ప్రధాన కారణాలను సుప్రీం కోర్టు వెల్లడించింది.