Home Page SliderTelangana

సీఎం పదవికి రాజీనామా చేయనున్న కేసీఆర్

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీనితో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన మరికాసేపట్లో రాజ్ భవన్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్ లేకుండానే ఆయన రాజ్ భవన్‌కు చేరుకోనున్నారని సమాచారం. కాగా అక్కడ ఆయన తన రాజీనామా పత్రాన్ని తెలంగాణా గవర్నర్‌ తమిళిసైకు సమర్పించనున్నారు.