Telangana

ఏపీయే తెలంగాణకు 11 వేల కోట్లివ్వాలన్న కేసీఆర్

తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించేలా చూడాలని కేంద్రాన్ని ఏపీ సర్కారు పదేపదే కొరుతున్న తరుణంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని కేంద్రం అంటోందని… నెలలో కట్టకుంటే చర్యలు సైతం తీసుకుంటామంటూ చెప్పిందంటూ కేసీఆర్ ఆక్షేపించారు. వాస్తవానికి ఏపీ నుంచి తెలంగాణకు 17 వేల కోట్ల రావాల్సి ఉందన్నారు కేసీఆర్. కృష్ణపట్నం పోర్టు సహా అనేక విషయాల్లో తెలంగాణకు వాటా ఉందన్నారు. కేంద్రం చెబుతున్నట్టుగా 6 వేల కోట్లు తగ్గించుకొని మిగతా 11 వేల కోట్లు తెలంగాణకు ఇప్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మలా మారిపోయారంటూ కేసీఆర్ ఫైరయ్యారు.