Home Page SliderTelangana

పాస్ పోర్ట్ ఆఫీసుకు కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత ఎర్రవల్లి ఫాంహౌస్ నుండి బయటికి వచ్చారు. ఇవాళ సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీసుకు తన భార్య శోభతో కలిసి వెళ్లారు. తన డిప్లమాటిక్ పాస్ పోర్టును సబ్మిట్ చేశారు. తన పాస్ పోర్టు, తన భార్య పాస్ పోర్టును రెన్యూవల్ చేయించుకున్నారు. అనంతరం నందినగర్ లోని నివాసానికి వెళ్లారు. అక్కడినుంచి తెలంగాణభవన్ కు వెళ్లి పార్టీ నేతల విస్తృత స్థాయి సమావే శంలో కేసీఆర్ పాల్గొంటారు. అయితే.. వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి తన మనవడు హిమాన్షుతో కొన్ని రోజులు గడిపేందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.