ఆస్పత్రికి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. చాలాకాలంగా ఎర్రవల్లి ఫామస్ కు పరిమితం అయిన ఆయన చాలా కాలంగా హెల్త్ చెకప్ చేయించుకోలేదు. దీంతో నేడు ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లతో కాసేపు ముచ్చటించారు. సాధారణ పరీక్షల కోసమే కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లినట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.