భారత్‌లోనే పెద్ద ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణా బిడ్డలు తయారుచేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని చూసి గర్వంగా ఉందన్నారు కేసీఆర్. రంగారెడ్డి జిల్లా కొండకల్‌లోని ప్రైవేట్ సంస్థ మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. వరంగల్ ముద్దు బిడ్డలు కశ్యప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేధా ప్యామిలీ ఈ ఫ్యాక్టరీతో వందలమందికి ఉపాధి కలిపిస్తున్నారని కేసీఆర్ మెచ్చుకున్నారు. ముంబయి నుండి మోనో రైలు ఆర్డర్ కూడా ఈ ఫ్యాక్టరీకి వచ్చిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దీనివల్ల లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణాకు వస్తున్నాయన్నారు. పరిశ్రమకు 15 రోజుల్లో అనుమతులు రాకపోతే అనుమతించినట్లే భావించి, పరిశ్రమను ప్రారంభించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేధా రైల్వేకోచ్ భారత్‌లోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ అని కొనియాడారు. దీనిని 800 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. రైల్ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు ఇక్కడ తయారు చేయనున్నారు.