Home Page SliderTelangana

ఎన్నికలయ్యాక కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే-కిషన్ రెడ్డి

దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా కేసీఆర్… అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రెస్ క్లబ్, గన్ పార్క్, ప్రగతి భవన్‌లో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమన్నారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని వస్తారా అని కేసీఆర్‌ను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుంటే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడాలన్నారు. బీజేపీపైనా, కేంద్రంపైనా ద్వేషంతో కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజీనామాకు తొందరెందుకు కేసీఆర్ అంటూ దెప్పిపొడిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్ భవన్‌ వెళ్లి.. రాజీనామా లేఖ ఇవ్వక తప్పదని.. కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.