కేసీఆర్‌ను ఓట్లతోనే ఓడించాలి-ఈటల
కొండపాక: పేదల భూములను లాక్కుంటున్న సీఎం కేసీఆర్‌ను సాగనంపాలని మాజీ మంత్రి, గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కొండపాక మండలంలోని బందారం, అంకిరెడ్డిపల్లి, దుద్దెడ, రాంపల్లి, ఖమ్మంపల్లి, సిర్సనగండ్ల, కొండపాక, దమ్మక్కపల్లి, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచారం జోరుగా చేస్తూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినేలా పనిచేయడంతో పాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

