Breaking NewsHome Page SliderLifestyleNational

కుంభ‌మేళా తొక్కిస‌లాటపై స్పందించిన కేసిఆర్‌

కుంభమేళా తొక్కిసలాటలో దుర‌దృష్ట‌వ‌శాత్తు చనిపోయిన భక్తులకు తెలంగాణ మాజీ సీఎం కేసిఆర్ త‌న‌ సంతాపాన్ని తెలిపారు.కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమన్నారు.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపధ్యంలో సరైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయ‌న సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.మ‌రో నెల రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ కుంభ మేళాకు 20 కోట్ల‌కు పైగా భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున యోగీ ప్ర‌భుత్వం స‌మ‌గ్ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.