టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారుతోంది. సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్యసమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానం పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేసీఆర్ ప్రతిపాదనకు సభ్యులంతా హర్షాతిరేకాల మధ్య మద్దతు తెలిపారు. ఇక పార్టీ పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశారు. తీర్మానం ఆమోదం తర్వాత కేసీఆర్ ఇకపై పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితి అంటూ ప్రకటించారు. పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ లేఖ రాసారు. పార్టీ రాజ్యాంగంలో సవరణతో ఇకపై పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మార్చినట్టుగా తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు తగిన విధంగా అడుగులు వేస్తున్నారు.
