NewsTelangana

కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. 8 గంటలకు కేసీఆర్ సమావేశం ఉండే అవకాశం ఉంది. మునుగోడు ఎన్నికకు సంబంధించి కేసీఆర్ మాట్లాడతారా? లేదంటే ఇంకేం మాట్లాడతారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఇటీవలే మునుగోడు బహిరంగ సభలో కేసీఆర్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేసీఆర్ మీడియా సమావేశం పెట్టడం.. అసలు ఉద్దేశమేంటన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.