కుటుంబమనుకున్నాడు కాబట్టి కేసీఆర్ పోయాడు. దేశం అనుకోబట్టే మోదీ హీరో అయ్యాడన్న ఈటల రాజేందర్
భువనగిరిలో జరిగిన గోవా సీఎం డా. ప్రమోద్ సావంత్ తో కలిసి విజయసంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. 140 కోట్ల భారత ప్రజల ముద్దుబిడ్డ మోదీ గారు మరోసారి ప్రధాని కావాలని ప్రజలందరూ సంకల్పించారు. ఈసారి యువత, మహిళలు అంతా మోడీ గారికే ఓటు వేయాలని నిచ్చయించుకున్నారు. అయోధ్య రామమందరం తిరిగి నిర్మించి 500 ఏళ్ల క్రితం కూలిన భారతజాతి విశ్వాసాన్ని నిలబెట్టారు కాబట్టే దేశప్రజలందరూ జై శ్రీరాం, జై మోదీ అంటున్నారు. దేశమంతా భిన్న సంస్కృతులు, భిన్న ప్రజలు ఉన్నా అందరూ మా మోదీ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మోదీ వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను భారతీయుని అంటే గౌరవం పెరిగింది అని గొప్పగా చెప్పుకుంటున్నారు.

అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో అమెరికా పోతే బూట్లు విప్పి చెక్ చేసి అవమానించారు. కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ భుజంమీద చేయివేసి మాట్లాడే సత్తా మన మోడీ సంపాదించుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ సంపాదించుకున్నాం. పదవివచ్చాక గతం మర్చిపోతారు కాని చాయ్ అమ్ముకున్న స్థాయి నుండి వచ్చాను అని గర్వంగా చెప్పుకొనే బిడ్డ మోదీ. కష్టాలు తెలిసిమ బిడ్డ కాబట్టే 12 కోట్ల టాయిలెట్ నిర్మించి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ మోదీ. కరోనా వస్తే మోదీ కన్నీళ్లు పెట్టలేదు. ధైర్యం ఇచ్చి కాపాడారు. ప్రపంచానికి వాక్సిన్ అందించారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ 5 వ ఆర్ధిక శక్తిగా ఎదిగింది. మూడవ స్థానం తీసుకురావాలి అనేది మోదీ సంకల్పం. యువశక్తి గలిగినది మన భారత దేశం.

మన ఎలక్ట్రానిక్ వస్తువులు మనదేశంలోనే ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగినం. ఇప్పుడు అంతా మేడ్ ఇన్ ఇండియా. కుటుంబాన్ని ముందు పెట్టడం వల్లనే జాతిపిత అవుదామనుకున్న కేసీఆర్ 10 ఏళ్లకే ఖతం అయ్యిండు. నాకు కుటుంబం లేదు 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్పుకునే వ్యక్తి నరేంద్ర మోదీ. బీజేపీ వస్తే కమ్యూనల్ దేశం అవుతుంది అన్నారు. కాలేదు సరికదా.. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మోదీ. కాంగ్రెస్ హామీలపై ఇప్పుడే విమర్శించను.. కానీ మీ హామీలు అమలు చేయకపోతే వదిలిపెట్టేది లేదు. ఈ ఎన్నికల్లో BRS కి ఓట్లు వేస్తే వృధా. సురక్షితంగా.. సుభిక్షంగా.. ఆత్మగౌరవంతో గల్లా ఎగురవేసుకొని బ్రతకాలి అంటే నరేంద్ర మోదీకి ఓటు వేసి గెలిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణలో 17 సీట్లకోసం బీజేపీ కొట్లాడుతోంది.


