అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ కీలక ప్రకటన
ఈ రోజు తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో కేసీఆర్, కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్‌హాట్‌గా సాగాయనే చెప్పాలి. అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేశారు. తెలంగాణాలో తాజాగా జరిగిన ఎస్సై పరీక్షలో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామి ఇచ్చారు. ఇటువంటి కీలక ప్రకటనలతో నేటి అసెంబ్లీ సమావేశాలు ముగిసి,రేపటికి వాయిదా పడ్డాయి.

