కేసీఆర్-జగన్‌వి చీకటి భేటీలు: తీన్మార్ మల్లన్న
టిజి: గతంలో కేసీఆర్-జగన్ ఎప్పుడూ చీకటి భేటీలు నిర్వహించేవారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల వలే విభజన హామీల పరిష్కారం కోసం చొరవ చూపారని అన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి -చంద్రబాబు సమావేశాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తున్నారని చెప్పారు.