Home Page SliderTelangana

కేసీఆర్.. మీ కచరా కల్చర్ ఇదేనా..!

భూభారతిపై సభలో చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడం పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు సహా బీఆర్ఎస్ సభ్యులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఫ్యామిలీ కోసమే వారి ఆందోళన అని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనంతా కచరా గవర్నెన్స్ అని అన్నారు. ‘అసెంబ్లీ చరి త్రలో ఇది చీకటి రోజు. బీఆర్ఎస్ సంస్కృతి ఇదేనా.. కేసీఆర్.. మీ ఎమ్మెల్యేలకు నేర్పింది ఇదేనా.. సభ్యులు ప్రజల సమస్యలు ప్రస్తావించేందుకు సభకు వస్తరు.. ఇలా ఆందోళన చేసేందుకు కాదు. ధరణి ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారు. వాళ్లకు ప్రజలు అవసరం లేదు. పార్టీనే ముఖ్యం. గత ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కారైనా భూముల ఆడిటింగ్ చేయాలి’ అని అక్బరుద్దీన్ కోరారు.