తెలంగాణాలో వ్యవసాయాన్ని పండుగ చేసిందే కేసీఆరే: కవిత
బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని అన్నారు. రైతు బంధు,రైతు భీమాతో తెలంగాణా రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. పంటలకు సాగు నీరు అందిస్తున్నామని కవిత పేర్కొన్నారు. రైతుల చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ విధంగా తెలంగాణాలో వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆరే అని కవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే కన్పిస్తారు. మిగతా సమయాల్లో మాయమవుతారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

