Home Page Sliderhome page sliderTelangana

కేసీఆర్ అంటేనే జూటా మాటలకు బ్రాండ్..

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అంటేనే జూటా మాటలకు బ్రాండ్ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చెప్పిన ముచ్చట్లు అన్ని అబద్దాలే మాట్లాడారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం 10 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందన్నారు. దురద్రుష్టం కొద్ది మా పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేరని.. లేకపోతే తామే అధికారంలోకి వచ్చే వాళ్లమని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని.. వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను ప్రశ్నించగా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని.. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని రాజాసింగ్ కేసీఆర్ కు చురకలంటించారు.