Home Page SliderNewsTelangana

కేసిఆర్ ఫాంహౌజ్ లో కూర్చుని ‘నీరో చక్రవర్తి’లాగా వ్యవహరిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో జనజీవనం వరదలతో అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌజ్‌లో కూర్చుని నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వరదల కారణంగా తీవ్ర నష్టానికి గురైన నిర్మల్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.

‘అనేక వాగులకు నిలయం అదిలాబాద్ అని,ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి నది సీఎం కెేసిఆర్  నిర్లక్షం వల్ల దుఃఖదాయినిగా మిగిలింది. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వరదల కారణంగా మంచిర్యాల ప్రతి సంవత్సరం మునిగిపోతుంది ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు కట్టడానికి బీజేపీ వ్యతిరేకం కాదని కానీ, వీటివల్ల పొలాల్లో ఇసుక మేట వేశాయి. తాటిచెట్టు లోతు కయ్యలు పడ్డాయి. పొలాలు జీవితంలో అక్కర రాకుండా పోయాయని’ పేర్కొన్నారు.

‘కడెం తెగిపోతే 35 ఊర్లు కొట్టుకు పోతాయి. గేట్ల సంఖ్య పెంచమని నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే దానిని అమలు చెయ్యలేదు. కడెం కింద ఉన్న గ్రామాల వారు నిద్ర లేని రాత్రులు గడపడం కేసిఆర్ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. గత సీజన్లో పంట నష్టానికి 10 వేల రూపాయలు ఇస్తా అని కెేసిఆర్ ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చే ఫసల్ భీమా పధకం కూడా అమలు చేయడం లేదు. రిలీఫ్ క్యాంప్ లలో కనీసం బొజనం కూడా పెట్టడం లేదు. మంత్రులు అధికారాలు లేక ఉత్త చేతులతో వస్తున్నారు. తక్షణ అవసరాల కోసం సాయం అందించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతంలో కట్టు బట్టలతో మిగిలిపోయారు.ఇళ్లలో సామాను కొట్టుకుపోయిన వారికి ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ఇవ్వాలి. వెంటనే సర్వే చేయించండి. ఇల్లు కూలిపోయిన వారికి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూం కింద అందించాలి’ అంటూ డిమాండ్ చేశారు.

‘వరదకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలి. వాగుల మీద కరకట్టల నిర్మాణం జరగాలి. కోత వేయబడ్డ భూములను ప్రభుత్వమే బాగు చేసి ఇవ్వాలి. ప్రాజెక్ట్ పక్కన, ముంపుకు గురి అవుతున్న భూములన్నీటినీ సేకరించి నష్ట పరిహారం అందించాలి’ అంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసి వరద అంచనా వేసి ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేయగానే.. నిపుణుల కమిటీ ని పంపించారు. వరదల మీద బీజేపీ  రిపోర్ట్ తయారు చేసి రాష్ట్రానికి, కేంద్రానికి అందిస్తాము. వరదల్లో ఇబ్బంది పెడుతున్న వారికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆసరాగా ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు.