కేసీఆర్ కనబడుటలేదు.. పోస్టర్లతో బీజేపీ నాయకుల ర్యాలీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిచిన కేసీఆర్.. ఇప్పటివరకు గజ్వేల్‌కు రాలేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలో పలుచోట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ వేసి ర్యాలీ తీశారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ అని నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు.

