కేసీఆర్ కలలు కనడం మానుకో…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఫాం హౌస్ లో ఉండి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ మాటలన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే అని విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఫామ్ హౌస్ పాలన గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని అన్నారు.