Home Page SliderTelangana

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ జెండా ఎగురవేసి బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు, పార్టీ ముఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.