మహిళా టీచర్ల మొర పట్టించుకో కేసీఆర్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళా టీచర్లు వినూత్నరీతిలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మొర పెట్టుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పని చేసేలా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 1600 మందికి పైగా స్పౌజ్ టీచర్లు తమ పిల్లలతో సహా 13 జిల్లాల నుండి 13 బోనాలతో మహిళలు బారులు తీరి వచ్చి, ఈ వినూత్న నిరసనను తెలియజేస్తున్నరు. భార్యాభర్తలు ఒకే చోట పని చేస్తే ఉత్పాదకత బాగుంటుందన్న కేసీఆర్ గతంలో మాటలను గుర్తు చేసే ప్లకార్డులు పట్టుకుని, బోనాలు తలపైకెత్తుకుని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా పని చేస్తూ ఉంటే పిల్లల బాగోగులు ఎలా చూసుకోగలుగుతామని, తమను కనీసం ఒక ఊరిలో కాకపోయినా ఒక జిల్లాలోనైనా పని చేసేలా ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.