కేసీఆర్ రెండు మూడు పెగ్గులు వేసి..
పదేళ్లు అధికారంలో ఉండి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రెండు మూడు పెగ్గులు వేసి కేసీఆర్ వరంగల్ సభకు వచ్చి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని వీర్లపల్లి శంకర్ ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడి బిడ్డ అని చెప్పుకునే కవిత లిక్కర్ స్కామ్ చేసి తెలంగాణ పరువు తీసిందన్నారు. 8 నెలల ముందే మద్యం షాపులకు టెండర్లను పిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాట్లాడడానికి సిగ్గు ఉండాలని చెప్పారు. పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని వీర్లపల్లి శంకర్ తెలిపారు.

