కేసీఆర్‌కు జాతీయ పార్టీ పెట్టే హక్కు లేదు
జాతీయస్థాయిలో పార్టీ పెట్టే హక్కు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేసీఆర్ పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ అని… ఆయన ఆంధ్రులను ద్రోహులుగా చిత్రీకరించారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తెలిపోయిందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకోవాల్సి వస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత చిక్కుకుందన్నారు.

