Telangana

మునుగోడుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.

మునుగోడుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… నేను రాజీనామా చేయకుంటే కేసీఆర్ మునుగోడు గురించి మాట్లాడేవారే కాదని, నా రాజీనామాతో మునుగోడుకు కేసీఆర్ ప్రభుత్వం కదిలివచ్చిందన్నారు. మునుగోడులో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఎందుకని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో మునుగోడులో తనను ఓడించాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.