NewsTelangana

మహేశ్‌బాబును ఓదార్చిన కేసీఆర్‌.. కృష్ణ భౌతికకాయానికి నివాళులు..  

సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఘన నివాళిలర్పించారు. కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం.. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ బాబును కేసీఆర్‌ హత్తుకుని ఓదార్చారు. మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌ పలువురు నేతలు సీఎం వెంట ఉన్నారు. మరోవైపు.. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా భాధాకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యక్తిగతంగా తాను గొప్ప మిత్రుడిని కోల్పోయానన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, మంచి విలక్షణమైన నటుడిగా ఎదిగారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.