కేసీఆర్‌కు పాలన చేతకాదు…
సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌కు పరిపాలన చేతకాదని.. పరిపాలన అంటే ఏంటో కేసీఆర్‌కు తెలియదని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రకటించిన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని బార్ల రాష్ట్రంగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణాలో ఏ ఒక్క పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించటంలేదంటూ వ్యాఖ్యానించిన షర్మిల తాను ప్రజల పక్షాన నిలబడటానికే తెలంగాణలో పార్టీ పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తే… సీఎం కేసీఆర్ వాటిని పక్కన పెట్టాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. మరోసారి కేసీఆర్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు షర్మిల.

