సామాన్యుల ఆకలి తీరుస్తున్న “కేసీఆర్ బువ్వకుండ”
“ప్రార్థించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న” ఈ మాటను తెలంగాణాలో అక్షరాల నిజం చేస్తుంది “కేసీఆర్ బువ్వకుండ” కార్యక్రమం. నగరాలు,పట్టణాల్లో వైద్య సేవలు,చికిత్స కోసం సామాన్య,మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా సర్కార్ దవాఖానాలకు వస్తుంటారు. అయితే రోగులకు సేవ చేసేందుకు వారి వెంట వారి బంధువులు కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో వారు నగరాలు, పట్టణాల్లో కొన్ని రోజులపాటు బస చేయాల్సివుంటుంది. ఈ క్రమంలో వారు రోగులను పట్టుకుని అన్ని రోజులు ఉండడం ఆర్థిక భారంతో కూడుకున్నదే. అయితే తెలంగాణాలో ఇలాంటి పరిస్థితిలో నిజామాబాద్,బోధన్ ఆసుపత్రికి వస్తున్నవారికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారు ఆకలితో అలమటించకుండా “కేసీఆర్ బువ్వకుండ” అన్నం పెట్టి వారి కడుపు నింపుతోంది.

అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు తన సొంత ఖర్చుతో దీనిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఆమె 2017 నవంబరులో కేసీఆర్ బువ్వకుండ పేరుతో నిజామాబాద్ ఆసుపత్రిలో తొలిసారిగా ఈ ఉచిత భోజనాల పంపిణీ కార్యక్రమానికి చుట్టారు. ఆ తర్వాత 2019లో బోధన్ ఆసుపత్రిలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ బువ్వకుండ కార్యక్రమం ద్వారా రెండు ఆసుపత్రుల్లో రోజుకి 1000 మందికి పైగా రోగుల బంధువులు,అనాథలు,యాచకుల ఆకలి తీరుస్తున్నారు. అంతేకాకుండ నిజామాబాద్‌లోని రెండు గ్రంథాలయాలు,ప్రెస్ క్లబ్‌లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ కూడా మరో 1000మందికి పైగా ప్రజల ఆకలి తీరుస్తున్న కేసీఆర్ బువ్వకుండ కార్యక్రమం పట్ల తెలంగాణా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.