భూములు గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ కేసీఆర్: ఈటల
సిద్దిపేట: ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంది సీఎం కేసీఆర్. ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంది అనుకున్నాం. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, రేషన్ కార్డ్ ఇవ్వాలని ఆయన అలోచన చెయ్యలే.. భూములు గుంజుకొని అమ్ముకునే బ్రోకర్ అయ్యాడు కేసీఆర్. మళ్ళీ వస్తే భూములు కాదు ఊళ్లకి ఊళ్లే గుంజుకుంటారు. నాచారంలో 1250 ఎకరాల మీద కేసీఆర్ కన్నుపడింది. దండుపల్లి, నర్సంపల్లి, అంతగిరిపల్లి, నాచారం భూములు tsiic (టిఎస్ఐసీసీ) కి అప్పగించాలని చూస్తున్నారు. నీచేతిలో ఓటు అనే అధికారం ఉంది. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? కేసీఆర్‌కి ఓటు వేసి గెలిపించాక భూములు గుంజుకోకుండా ఉంటారా? మందుడబ్బా పట్టుకొని కాదు ఓటుతో కేసీఆర్‌ని చంపండి. కేసీఆర్‌ను ఓడగొట్టాలి అప్పుడే మీ బాధలకి విముక్తి. మీటింగ్‌కి పోవద్దు అంటున్నారట..
గజ్వేల్ ప్రజలు నీకేమన్నా జీతగాళ్లలా కనబడుతున్నారా? నీ జాగీరా ఏమన్నా? పెన్షన్ పోతుంది అని భయపెడుతున్నారట, నీ ఇంట్లో నుండి ఇస్తున్నావా? కేసీఆర్ మళ్ళీ గెలిస్తే గజ్వేల్ కాదు మొత్తం తెలంగాణ అధోగతి పాలు అవుతుంది. సొమ్ము కేంద్రానిది సోకు కేసీఆర్‌ది. తాగిపించడంలో తెలంగాణ ప్రజలను నంబర్ వన్ చేశారు.