Home Page SliderNational

KBC 16: భార్య జయతో గడపడానికి టైమ్ ఉంటుందా సార్‌?

KBC 16: భార్య జయతో కొంత సమయమేనా గడుపుతారా? పోటీదారుడి ప్రశ్నకు బిగ్ బి సమాధానం.. కౌన్ బనేగా కరోడ్‌పతి 16 తాజా ఎపిసోడ్‌లో, ఒక పోటీదారుడు అమితాబ్ బచ్చన్‌ను అతని భార్య జయ బచ్చన్‌తో ఏకాంతంగా గడపడం గురించి అడిగాడు. సీనియర్ నటుడి సమాధానం అందరినీ ఆకట్టుకుంది. అమితాబ్‌ తన భార్య ఎల్లప్పుడూ తనకు మద్దతుగా ఎలా ఉండేదో గుర్తుచేసుకున్నారు. 2000లో ప్రారంభించినప్పటి నుండి అమితాబ్ బచ్చన్ KBCకి హోస్ట్‌గా ఉన్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 16 ఇటీవలి ఎపిసోడ్‌లో, అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్‌తో సమయం గడపడం గురించి ఒక పోటీదారు అడిగిన ప్రశ్నకు.. 1973లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు పెళ్లయి 50 ఏళ్లు దాటింది. తన బిజీ కెబిసి షూటింగ్ షెడ్యూల్‌ను బట్టి, తనతో తగినంత సమయం గడపడం లేదని జయ ఫిర్యాదు ఎప్పుడైనా చేశారా అని కంటెస్టెంట్ సుమిత్రా దినేష్ సరదాగా అడిగారు.

ఆ ప్రశ్నకు బిగ్ బి నవ్వుతూ బదులిస్తూ, “ఓహో క్యా బటాయే? యే జోహ్ పరివారిక్ ప్రశ్నన్ పుచ్ లేతే హై నా లోగ్ యహా ఆకే.. ఉస్మే హమ్కో బడా కష్ట్ హోతా హై (నేను ఏమి చెప్పగలను? ఇక్కడ ప్రజలు అడిగే ఈ వ్యక్తిగత ప్రశ్నలకి, వారు నన్ను చాలా ఓపెన్‌గా అడుగుతున్నారు ఈ లైవ్‌లో ఎలా చెప్పగలను) అయితే, అమితాబ్‌ మూడు వేర్వేరు సినిమాల్లో సర్కస్ ఫీట్లు చేస్తూ మూడు వేర్వేరు షిఫ్ట్‌లలో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకడం లేదు అని ఒప్పుకున్నట్లు అయింది. కయీ సాల్ బీట్ గయే ఔర్ హమ్ ఆగయే ఫిల్మ్ ఉద్యోగ్ మే. ఈధర్ కమ్ కర్ణ షురు కర్దియా. హమారా కామ్ జో థా వో తీన్ తీన్ షిఫ్ట్ మే హోతా థా. సుబహ్ 7 బజే సే లేకే దుపహర్ 2 బజే తక్ ఏక్ ఫిల్మ్ ఏక్ షిఫ్ట్. 2 బజే దుపహార్ సే లేకే 10 బజే తక్ రాత్ కో దుశ్రీ అలగ్ ఫిల్మ్, దస్రా షిఫ్ట్. (నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి చాలా ఏళ్లే అయింది. నేను ఇక్కడ పని చేయడం ప్రారంభించిన దగ్గర నుండి నా పని మూడు షిఫ్టులుగా ఉండేవి. 7 AM నుండి 2 PM వరకు, నేను ఒక సినిమాకి పని చేశాను. 2 PM నుండి 10 PM వరకు, మరొక సినిమాకి రెండవ షిఫ్ట్). ‘షోలే’ తాను మరొక సినిమా కోసం రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొనేవాడినని షేర్ చేశారు. తన తండ్రి, దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ కూడా దీనిపై ఒకసారి వ్యాఖ్యానించారని, “బోలే బేటా తుమ్ కామ్ బహుత్ కర్తే హోహ్” అని అడిగారని అమితాబ్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. హమ్ బోలే బౌజీ పైసా బడి ముష్కిల్ సే మిల్తా హై (అప్పుడు కొడుకుతో నువ్వు చాలా కష్టపడి పనిచేస్తున్నావు. నీకు టైమే ఉండడం లేదు. నేను దానికి ఇలా జవాబిచ్చాను, నాన్నా, డబ్బు సంపాదించడం చాలా కష్టం) నీకు తెలుసు కదా. చివర్లో అమితాబ్ మాట్లాడుతూ.. కుటుంబంతో సమయం గడపలేకపోయినా తన భార్య జయ తనకు ఎంతో అండగా నిలిచారని, ఏమీ మాట్లాడేది కాదని, సైలెంట్‌గా కో-ఆపరేట్ చేసేవారన్నారు.

అమితాబ్ బచ్చన్ 2000లో KBC ప్రారంభించినప్పటి నుండి షారుఖ్ ఖాన్ నేతృత్వంలోని మూడవ సీజన్ మినహాయించి తర్వాత అన్ని ఎపిసోడ్లకి హోస్ట్ గానే ఉన్నారు. షో సీజన్ 16 – మొదలైన దగ్గర నుండి సోనీ టీవీలో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రదర్శించబడుతోంది.