హాస్పటల్‌లో చేరిన కోమటిరెడ్డిని పరామర్శించిన కవిత
తెలంగాణా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి వెళ్లి వెంకటరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నట్లు తెలిపారు.అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన యశోద ఆసుపత్రిలో చేరగా రెండు రోజు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.