Home Page SliderNational

మద్యం కేసులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులైన ఈడీ, సీబీఐ వాదనలు వినకుండా బెయిల్ మంజూరు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈడీ, సీబీఐలను తమ వాదనలు వినిపించమని కోరింది.  వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరగా, ఈ నెల 20న విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.