Home Page SliderTelangana

రేపోమాపో కవిత జెలుకెళ్లక తప్పదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని.. అందుకే పేరు మార్చితేనన్న ఎన్నికల్లో గెలవొచ్చని కేసీఆర్ ట్రై చేస్తున్నాడన్నారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ఓ పెద్ద కహానీ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఉందని మునుగోడు ఉపఎన్నికలో తెలిపోయిందన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి, కౌరవ సైన్యం తెచ్చి గ్రామానికి మంత్రి, ఎమ్మెల్యే వచ్చి… అధికార దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ఎన్నికల్లో గెలిచారన్నారు. పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అంటే జనం ఓటేయరని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. బీజేపీని బ్లేమ్ చేసేందుకు నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నమంటూ నాటకమాడారన్నారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యమన్నదే లేదన్నారు. కుటుంబ పాలన, నియంత పాలన ఉందన్న రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వాన్ని దించేందుకు… తెలంగాణ ప్రజలు పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయానని… తనపై ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను డబ్బు కోసం, పదవి కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదన్నారు కోమటిరెడ్డి. దేవుడు సన్నిధిలో చెబుతున్నా ప్రమాణం చేస్తున్నాని చెప్పారు. నిజం నిప్పు లాంటిదన్నారు. ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్మును ఢిల్లీకి తీసుకెళ్లి 600 లిక్కర్ షాపులు తీసుకుందన్నారు. రేపోమాపో… సీఎం కేసీఆర్ కుమార్తె, గారాలపట్టి, ఎమ్మెల్సీ కవిత జైలుపాలవ్వక తప్పదన్నారు.