జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం..
ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన కవిత సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్లాలని కవిత ఫిక్స్ అయిందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. తండ్రికి, కూతురికి మధ్య అసలు మధ్యవర్తులు ఎందుకు? అని ప్రశ్నించారు. మాట్లాడుకోవడానికి లైవ్ ఫోన్ ఉంది, ఫాంహౌస్ ఉంది, బిడ్డ వస్తానంటే తండ్రి వద్దంటాడా .. ఇదంతా ఆ కుటుంబం ఆడుతున్న నాటకంలా అనిపిస్తుందన్నారు రఘునందన్ రావు.