కవిత నేడు ప్రారంభిస్తున్న ‘జాగృతి జనం బాట’ యాత్ర
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు ‘జాగృతి జనం బాట’ యాత్రను ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, మీడియాతో మాట్లాడనున్నారు.
తర్వాత మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ గేట్ వద్దకు చేరుకున్న కవితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు.
సుమారు నాలుగు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే ఈ యాత్రలో కవిత మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ యాత్రకు విస్తృత ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

