Breaking Newshome page sliderHome Page SliderTelangana

కవితకు 400 ఓట్లు కూడా రావు

రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. తాజాగా ఒక న్యూస్ చానల్‍తో మాట్లాడిన అరవింద్ .. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఈ విషయాన్ని ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కవిత అడగాలన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాధించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలు కాదు కదా నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్క సారి ఎంపీ అయ్యారని అరవింద్ విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో చెప్పగలను కానీ జూబ్లీహిల్స్ గురించి అరవింద్ చెప్పలేనన్నారు .