Home Page SliderTelangana

ఎయిర్ పోర్టులో కవిత-చుట్టుముట్టిన కార్యకర్తలు

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి ఐదు నెలల పైగా తీహార్ జైలులో శిక్ష అనుభవించి, బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్‌లో భారీ స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను అభిమానులు, కార్యకర్తలు వేల సంఖ్యలో చుట్టుముట్టారు. ఆమె మాట్లాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభిమానులు, జాగృతి కార్యకర్తలతో శంషాబాద్ విమానాశ్రయం వద్ద ట్రాఫిక్ స్తంభించింది. విమాన ప్రయాణీకులకు ఎయిర్ పోర్టు చేరుకోవడానికి, హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టు బయటకు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది. కవిత ఇంటికి చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.