నేను అసలే మంచిదాన్ని కాను..నేను నోరు తెరిస్తే..
మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానని తెలిపారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని మీడియాతో చిట్ చాట్ లో భగ్గుమన్నారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమొస్తుందని నిలదీశారు. తాను జైలుకెళ్లినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారని వివరించారు. తాను అసలే మంచిదాన్ని కాదని..తాను నోరు తెరిస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చారు. తన నాన్నకి నేను లేఖ రాస్తే మీకు ఏంటి నొప్పి..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కడే తనకు బాస్ అన్నారు. తన మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించేంత సీన్ ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఇంకో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానన్నారు కవిత.

