తీహార్ జైల్లో కవితకు అనారోగ్యం
దిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో విచారణలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యింది. దీనితో జైలు అధికారులు ఆమెను దీన్‌దయాల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెకు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రావలసి ఉంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత నాలుగు నెలలుగా ఈడీ, సీబీఐ కేసులలో కవిత విచారణ పేరుతో తీహార్ జైలులో ఉన్నారు. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేశారు. పది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కవితను అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. ఈ మధ్యలో ఆమెను సీబీఐ కూడా కొన్ని రోజుల పాటు కస్టడీలో విచారించింది.

