Home Page SliderNational

మరోసారి కవిత కస్టడీ పొడిగింపు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కోర్టులో చుక్కెదురయ్యింది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. జూలై 7 వరకూ ఆమె కస్టడీని పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కోర్టులో కవితను వర్చువల్‌గా హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో సంబంధం ఉన్నట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.