Breaking NewsHome Page SliderNewsTelangana

కేటిఆరా…మ‌జాకా!

ముక్కుసూటిత‌నం….ప్ర‌శ్నించేతత్వం…చిత్త‌శుద్ది…ఈ మూడు క‌ల‌గలిపితే కేటిఆర్‌.రాజ‌కీయాలంటే హుందాగా ఉండాల‌ని అధికారంలో ఉన్న‌ప్పుడే చెప్పిన ఆయ‌న …ప్ర‌తిప‌క్షంలోనూ దాన్ని తూ.చ‌.త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తూ ఉంటార‌న‌డానికి సోమ‌వారం ఏసిబి కార్యాల‌యం ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌ట‌నే సాక్షీభూతంగా నిలిచింది. పోలీసులు,నోటీసులు,కోర్టులు,అరెస్టుల పేరిట బెదిరించే అధికారులు,ప్ర‌భుత్వాల‌కు క‌నువిప్పు గ‌లిగేలా కేటిఆర్ వ్య‌వ‌హ‌రించారు.ఏసిబి విచార‌ణకు బ‌య‌లుదేరిన ఆయ‌న‌ను అధికారులు అడ్డుకున్నారు.న్యాయ‌వాదులు లేకుండా లోప‌లికి రావాలని సూచించారు. దాంతో కేటిఆర్ ప్ర‌తిఘ‌టించారు.అడ్వొకేట్‌తో విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వ‌డం అనేది వ్య‌క్తి హ‌క్క‌ని గ‌ట్టిగా మాట్లాడారు.కోర్టు ఉత్త‌ర్వుల్లో ఆ విష‌యం లేద‌ని పోలీసులు చెప్ప‌డంతో…మ‌రి కోర్టు తీర్పుని రిజ‌ర్వ్ చేసిన‌ప్పుడు విచార‌ణ ఎలా చేప‌డ‌తార‌ని నిల‌దీశారు.దీంతో ఏసిబి అధికారులు నివ్వెర‌పోయారు. రేవంత్ రెడ్డి దొంగ ప‌త్రాలు సృష్టించి త‌న ఇంట్లో పెట్టించి త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నార‌ని అంత ఈజీగా దొర‌క‌న‌ని చెప్పారు.ఏసిబి త‌న‌కు స‌ర్వ్ చేసిన నోటీసుల్లో స్ప‌ష్ట‌త లేద‌ని మ‌ళ్లీ ఇవ్వాల‌ని కోరారు. అంతే కాదు కేసులకు ఎట్టిప‌రిస్థితుల్లో భ‌య‌ప‌డ‌న‌ని హెచ్చ‌రించి తిరిగి పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు.