ఆరా ఫౌండేషన్ అధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం
ఆరా ఫౌండేషన్, హెచ్‌ఎమ్ టీవీ అధ్వర్యంలో చిలుకలూరి పేటలో వైభవంగా కార్తీక దీపోత్సవం, శివపార్వతుల కళ్యాణం జరుగనుంది. దీనిని చూసేందుకు తండోపతండాలుగా భక్తులు బారులు తీరి ఉన్నారు. గ్రామంలో శివపార్వతుల కళ్యాణానికి శివపార్వతుల విగ్రహాలను నగరంలో వైభవంగా ఊరేగింపుగా మేళతాళాలతో కళ్యాణం జరిగే గోల్కొండ గార్డెన్‌కు తీసుకువస్తున్నారు.

కార్తీకమాసంలో ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించడం, రుద్రాభిషేకం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. శక్తి లేక దూర ప్రాంతాలలో ఉండే పుణ్యక్షేత్రాలను, శివాలయాలను దర్శించలేని వారు ఇలాంటి ఉత్సవాలను దర్శించడం వలన కూడా ముక్తి లభిస్తుంది. ఈ కార్యక్రమంలో కళ్యాణంతో పాటు ప్రవచనాలు, పంచహారతులు, పండితుల అనుగ్రహభాషణం, రుద్రాభిషేకం జరుగనున్నాయి.

