Home Page SliderNational

కర్నాటకలో సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్ నమోదు

కర్నాటకలో సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం ఓటింగ్ నమోదైంది. కొద్ది సేపటి క్రితం కర్నాటకలో పోలింగ్ పూర్తయ్యింది. ఐతే క్యూ లైన్లో నిలబడి ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తామని చెప్పారు. 225 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కర్నాటకలో మెజార్టీ మార్క్ 113. కర్నాటకలో ఈసారి ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నదానిపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయ్. తిరిగి గెలుస్తామని బీజేపీ చెబుతుంటే, ఇక వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని ఆ పార్టీ ఘంటాబజాయించి మరీ చెబుతోంది. ఇక జేడీఎస్ సైతం ఎవరికీ మెజార్టీ రాదని, తాము మద్దతిస్తేనే ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న విశ్వాసంలో ఉంది. మరికాసపేట్లో కర్నాటక ఎగ్జిట్ ఫలితాలు రానుండగా, ఈ శనివారం కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.